ఉప్పెన సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండ పొలం సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. కాగా తాజాగా తన మూడవ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో.
ఈ చిత్రానికి రంగరంగ వైభవంగా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు వీడియో ని రిలీజ్ చేశారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే బటర్ ఫ్లై కిస్ అంటూ దర్శకుడు సరికొత్తగా హీరో హీరోయిన్లను ఎమోషన్స్ ని చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మరి చూడాలి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో.