పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పంజా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇప్పుడు విష్ణువర్ధన్ తో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి పంజా ఫ్లాప్ కావడంతో విష్ణువర్ధన్ కూడా తెలుగులో అవకాశాలు రాలేదు. కాగా బాలీవుడ్ నాట షేర్ షా చిత్రం తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు విష్ణు వర్ధన్.
కాగా విష్ణువర్ధన్ ఓ కథను సిద్ధం చేసుకొని వైష్ణవ్ కు వినిపించాడట. కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. కాగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.