సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో వైష్ణవ్ తేజ్. కాగా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి చిత్రం ఉప్పెన మంచి విజయవంతమైంది. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేశాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు వైష్ణవ్ తన మూడో సినిమా గిరీశయ్య దర్శకత్వం లో చేస్తున్నాడు.
ఈ సినిమాకు రంగ రంగ వైభవంగా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ఫిల్మ్ ఫేమ్ కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే వైష్ణవ్ ఈ దర్శకుడిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉందట. గిరీశయ్య సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా పని చేశారట. అంతే కాదు, అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ ఆదిత్య వర్మ ను తెరకెక్కించారు.
ఆ రీమేక్ విజయం సాధించటంలో గిరీశయ్య విఫలమైనప్పటికీ, తెలుగు హీరోలు మాత్రం అతను తన బాస్ సందీప్ లా హిట్ కొడతాడనే భావిస్తున్నారట. ఈ ఆశతోనే ఈ మెగా హీరో కూడా తన ప్రాజెక్ట్ కు ఒకే చెప్పాడట. అదే సమయంలో నిర్మాత BVSN ప్రసాద్ కూడా భారీ మొత్తంలో డబ్బు చెల్లించి, దేవి శ్రీ ప్రసాద్‌ని తీసుకుని అద్భుతమైన మ్యాజిక్ సృష్టించాడు.
ఇవన్నీ కూడా వైష్ణవ్ తేజ్ కు కలిసివచ్చే అంశాలనే చెప్పాలి. మరి ఈ సినిమాతో వైష్ణవ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.