వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటిస్తూ…. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌లో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ క్యాంటీన్ లో కూర్చుని కనిపించారు. కేతిక టేబుల్ పై ఉన్న బుక్స్ మీద తల పెట్టి నిద్రపోతుంటే, వైష్ణవ్ ఆమెని చూస్తూ కనిపించాడు.
ఇక ఈ సినిమాకు అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా ఉప్పెన సినిమాతో సక్సెస్ కొట్టి స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.