మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఉప్పెన. గత ఏడాది ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల థియేటర్స్ ఓపెన్ కావడంతో ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ రోజు భోగి, వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కావడంతో సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా తెలిపింది.