రాజకీయాలలో ఓవైపు చురుకుగా తిరుగుతూనే వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
తాజాగా నిజాం కళాశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అయితే అక్కడే లొకేషన్ లో తీసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. నిజాం కాలేజీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో వారందరితో పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా దిగారు.