వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఫైనల్లీ లైన్ క్లియరైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా.. మొదట ఈ వేడుకకు పోలీసులు నో చెప్పారు. హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని సిద్ధంకాగా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. కానీ అప్పటికే ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేయాలని సినిమా నిర్మాతలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. అయితే ఒకేచోట అంత మంది జనం గుమిగూడితే ప్రమాదమైనందున పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు సష్టం చేశారు. దీంతో మరో ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి.. నిర్వాహకులు మరోసారి పోలీసులను ఆశ్రయిచారు.
ముందు అనుకున్నట్టుగా భారీ ఎత్తున కాకుండా పరిమిత సంఖ్యలో అతిథులతోనే వేడుక జరుపుతామని నిర్వాహకులు అనుమతి కోరారు. చివరికి కొన్ని షరతులతో వేడుక నిర్వహణకు పోలీసులు ఓకే చెప్పారు. అలా శిల్పకళా వేదికగా.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది.
కాగా, పాసులు ఉన్నవారిని మాత్రమే ఫంక్షన్‌కు అనుమతించునున్నారు. అలాగే కచ్చితంగా మాస్క్ పెట్టుకుని వస్తేనే లోపలకి ప్రవేశం కల్పించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. మొత్తానికి అసలే జరగదనుకున్న వేడుక.. ఎలాగోలా ఒకే కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.