వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. పవన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దర్శకుడుని కౌగిలించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి,నివేదాథామస్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.