వకీల్ సాబ్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ. మహిళలపై వేధింపులు, న్యాయసహయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదలకు ముస్తాబ్ అవుతుంది. సినిమా పై భారీ అంచనాలున్న నేపథ్యంలో… సినిమాకు మరింత హైప్ వచ్చేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మతగా… బోనీకపూర్ కో-ప్రొడ్యూసర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కాగా… ఏప్రిల్ 3న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. యూసుఫ్ గూడ గ్రౌండ్ లో ఈవెంట్ చేయాలని దిల్ రాజు టీం డిసైడ్ అయ్యిందని, త్వరలో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.