పవన్ కళ్యాణ్ ఓ వైపు పాలిటిక్స్ ను, మరోవైపు సినిమాలను చేస్తూ అభిమానులకు చేరువ అవుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పవన్ మొహానికి రంగేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంసీఏ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ కు అనూహ్య స్పందన లభించింది.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక చేస్తోన్న సినిమా కావడంతో వకీల్ సాబ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అజ్ఞాతవాసి మూవీ తరువాత పవన్ వకీల్ సాబ్ తో పలకరిస్తుండటంతో ఈ సినిమా విడుదల కోసం పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన మరో పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కుడి చేత్తో ఫైల్స్, ఎడమ చేతిలో బ్యాగ్ పట్టుకొని కోర్టులో కేసు వాదించడానికి వెళ్తోన్నత్తుగా ఈ పోస్టర్ లో పవన్ లుక్ సుపర్బ్ అని చెప్పుకోవాలి. అధికారికంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేసినట్టుగా ఉన్నప్పటికీ… ఈ పోస్టర్ ను పవన్ ఫ్యాన్ క్రియేట్ చేయడం విశేషం.
ఈ సినిమాను ముందుగా మే 15న రిలీజ్ చేస్తామని ప్రకటించిన..కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై సందిగ్దం నెలకొంది. అయితే అభిమానుల్లో నెలకొన్న సందిగ్దానికి తెరదించుతూ త్వరలోనే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ను ప్రకటించే చాన్స్ ఉంది. వకీల్ సాబ్ సినిమా తరువాత క్రిష్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ తో పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నారు.