ఈ సమ్మర్ కు పెద్ద హీరోల సినిమాలన్నీ క్యూ కట్టనున్నాయి. ఏప్రిల్ 9 నుండి ఏడాదిగా సిల్వర్ స్క్రీన్ పై హాడావిడి లేని అగ్రహీరోలంతా ప్రేక్షకులను అలరించబోతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ ప్రమోషన్లు మొదలయ్యాయి. సినిమా నుండి వచ్చిన మూడు పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా … ఈనెల 29న వకీల్ సాబ్ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది.
ఏప్రిల్ 4న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు పాల్గొంటారని తెలుస్తోంది.