పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో వచ్చిన పింక్ సినిమా రీమేక్ గా ఈ మూవీ వస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ… సినిమా పూర్తి భిన్నంగా సాగనున్నట్లు తెలుస్తోంది. మెసెజ్ అదే అయినా, టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పవన్ అభిమానులకు సరిపోయేలా సినిమాను దర్శకుడు శ్రీరాం వేణు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఓ చిన్న ప్లాష్ బ్యాక్ సీన్ కూడా కలిపారని… ఇందులో పవన్ భార్యగా నటించిన శృతి హసన్ తో సీన్ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, అంజలి, అనన్య, నివేథా థామస్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించారు.