వకీల్‌సాబ్‌కు ప్రాబ్లం వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహణ డైలామాలో పడింది. కరోనా విజృంభణ కారణంగా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ వేడుకకు పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్‌లో అయితే ఫంక్షన్ జరగడం కష్టమేనని అనిపిస్తోంది.
ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్‌లో వకీల్‌సాబ్ రిలీజ్ వేడుక నిర్వహించాలని మూవీ టీం భావించింది. నిర్వహణ బాధ్యతలను జే మీడియా ఫ్యాక్టరీకి అప్పగించింది. దీంతో జే మీడియా ఫంక్షన్‌కు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరింది. 5వేల నుంచి 6 వేల మందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారి దృష్టికి తీసుకెళ్లింది. అయితే రాష్ట్రంలో సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో..పర్మిషన్ ఇవ్వలేని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రీ రిలీజ్ పంక్షన్ ఉంటుందా లేదా అన్నది అనుమానంగా కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగలేని పక్షంలో.. ఏపీలో ఏదో ఒక చోట నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.