రష్మిక మందన్న, శర్వానంద్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ ఫ్యామిలీ ఎంటెర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో సాంగ్ రిలీజ్ కాబోతుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఇక కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అర్ధం అయిపోతుంది.
ఇందులో శర్వానంద్ రష్మిక మందన్నను బీచ్‌లో అలా ఫాలో అవుతూ సైకిల్ పై కనిపించగా పక్కనే రష్మిక నడుస్తూ కనిపిస్తుంది.
ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 25న థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానుంది.