వాలెంటైన్స్ డే సందర్భంగా ఫోకస్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. విజయ్ శంకర్, బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫోకస్. ఈ చిత్రంకు నూతన దర్శకుడు సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఫోకస్ మూవీ తెరకెక్కుతోంది.కాగా నేడు వాలెంటైన్స్ డే కానుకగా ఫోకస్ మూవీ నుండి స్పెషల్ పోస్టర్‌ను విడుదలచేశారు మేకర్స్.
ఇక కొత్తగా రిలీజ్ అయిన పోస్టర్‌లో విజయ్ శంకర్, అషు రెడ్డి ఒకరినొకరు హత్తుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ రొమాంటిక్ పోస్టర్ వాలెంటైన్స్ డేకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనేలా ఉంది.అలాగే త్వరలోనే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు.
ఇందులో విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించనున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ కీలక పాత్రల్లో నటించారు.