తన రాజీనామా లేఖపై స్పందించిన చంద్రబాబు లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధన్యవాదాలు చెప్పారు. 2006 నుంచి మీ అడుగుజాడల్లో నడిచానని, ఎటువంటి దాపరికాలు లేకుండా ప్రతి సమస్య మీ ముందు ఉంచానని,ఎమ్మెల్యే గా గెలిచేఅవకాశం ఉన్న మొదటిసారి మీ మాట విని పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నేను భాదపలేదన్నారు వంశీ. అన్యాయాన్ని ఎదిరించటంలో ఎన్నో సార్లు ఓ సీనియర్ నేతపై, ఐపీఎస్ పై సాగిందని గుర్తుచేశారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొనటంలో మీ అడుగు జాడల్లో నడిచానని మీ మద్దతును ఎప్పుడు గుర్తుంచుకుంటాను అని తెలిపారు.