మన ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఫాన్స్ కి ఒకరకంగా పండగ అనే చెప్పాలి. అగ్ర హీరోలు కూడా ఆయన సినిమాల్లో నటించడానికి చూస్తున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్కార్ హడావుడిలో ఉన్నారు. మొన్న ఉదయం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చింది.
ఆ తర్వాతి నుంచి ఇక ఇండియాలో రాజమౌళి పేరు మార్మోగిపోతుంది అనే చెప్పాలి. ఇదిలా ఉంచితే ఇప్పుడు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం ఏకంగా వంద కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడని అలాగే లాభాల్లో వాటా కూడా అడుగుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు కూడా భారీగానే అడుగుతున్నాడు.
మహేష్ బాబు రెమ్యునరేషన్ దాదాపుగా 70 కోట్లకు పై మాటే. దీనితో ఇప్పుడు రాజమౌళి తో సినిమా చేయడం అనేది సాధారణ విషయం కాదు అంటున్నారు నిర్మాతలు. హాలీవుడ్ నిర్మాతలు మాత్రమే ఆ రేంజ్ లో డిమాండ్ చేసేవారు. కాని రాజమౌళి ఇప్పుడు అలా డిమాండ్ చేయడంతో మన తెలుగు నిర్మాతలు దాదాపుగా ఆయన్ను పక్కన పెట్టినట్టే అనే మాట వినపడుతుంది. బాలీవుడ్ నిర్మాతలే ధైర్యం చేయాలి.