అల్లు అర్జున్ హీరోగా… క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఒక ట్రెండ్ ని జాతీయ స్థాయిలో సెట్ చేసింది అనే మాట వాస్తవం.
సినిమా విషయంలో అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉందో… ఆ సినిమాలో వైరల్ అయిన ఎన్నో సన్నివేశాలు మనకు స్పష్టంగా చెప్పాయి. కూలి నుంచి సిండికేట్ స్థాయికి అతను ఏ విధంగా పైకి వచ్చాడు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా రెండో భాగం కూడా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో ఆ సినిమా వస్తుంది.
Also Read:130 రష్యన్ బస్సులు సిద్ధం:పుతిన్
అయితే ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు సినిమాకు సంబంధించి మనకు కొన్ని తప్పులు అర్ధం కావు గాని… ప్రైమ్ లో చూసినప్పుడు మాత్రం కొన్ని అర్థమవుతూ ఉంటాయి. ఇలా పుష్ప కు సంబంధించి ఒక తప్పు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పుష్ప ఫ్రెండ్ గా ఉన్న కేశవను ఒక వ్యాన్ కొనాలని చెప్తాడు. 5 లక్షల డబ్బులను వ్యాన్ కొనడానికి తీసుకెళ్ళి వెంటనే కొనుక్కు రావాలని చెప్తాడు.
ఆ డబ్బులు కేశవకు అవసరం ఉన్నా సరే పుష్ప మాట వినకుండా కొనాలని పట్టుబట్టి కొని తెస్తాడు. ఆ సన్నివేశానికి ముందు… కేశవకు కారు డోర్ కూడా తీయడం రాదూ. కాని కారు కొని కేశవా కారు డ్రైవ్ చేసుకుంటూ పుష్ప వద్దకు వస్తాడు. మరి కారు డోర్ తీయడం రానివాడు కారు ఎలా డ్రైవ్ చేసాడు…? అయితే అంతకు ముందు లారీ డ్రైవ్ చేసాడు కాబట్టి ఆ అనుభవంతోనే కారు కూడా డ్రైవ్ చేసాడని కొందరు చెప్తున్నారు.
Also Read:నేనింతే.. పుతిన్ మరో సంచలనం..!