కోల్‌కతాలో హైడ్రామా చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే ఆమె వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించారు. కేవలం తన సీటుకే పరిమితమై ఉండిపోయారు.
ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ ఈ రోజు ఉదయం కన్ను మూశారు. ఈ క్రమంలో కోల్‌కతాలో జరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి ఆయన భౌతికంగా హాజరు కావాల్సి హాజరు కావాల్సి వుండగా వర్చువల్ గా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ నేపత్యంలో రైల్వేస్టేషన్ వద్ద ఒక వర్గానికి చెందిన ఆహ్వానితులు కొందరు ‘జైశ్రీరామ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సీఎం మమతా బెనర్జీ అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న గవర్నర్‌కు దీనిపై ఫిర్యాదు చేసినట్టు కనిపించింది.
ఆమెను శాంత పరచేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె వేదికపైకి వచ్చేందుకు నిరాకరించారు. వేదిక ముందు ఆడియెన్స్‌తో కలిసి కూర్చున్న సీటులోనే ఆమె ఉండిపోయారు.