తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ సేవలు లాఛనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఈ రూట్ లో ముందుస్తుగా ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా.. ఒంగోలు ఉదయం 5.20 కి, చీరాల ఉదయం 6.25 గంటలకు, విజయవాడ ఉదయం 8.25 గంటలకు చేరుకుంది. ఇక సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనున్న ఈ వందేభారత్ రైలును కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల సంక్రాంతి రోజున సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభించడంతో తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇక దక్షిణాది రాష్ట్రాల మీదుగా త్వరలో మరిన్ని వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది. మూడు హై స్పీడ్ వందే భారత్ సిరీస్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరుకు,సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీసులను అందించనున్నట్టు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ రైలును చెన్నై, బెంగుళూరు, మైసూరు మధ్య గతేడాది నవంబర్ లో ప్రారంభించారు.