ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వంగవీటి రాధా తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎంగా జగన్ ఏ జిల్లాలో భాద్యతలను చేపట్టారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. తుళ్ళూరులో రైతులు చేపట్టిన దీక్షకు వంగవీటి రాధా హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం రాధా మాట్లాడుతూ.. జగన్ 30రాజధానులను ఏర్పాటు చేసిన పర్వాలేదని కానీ తమకు తెలిసింది మాత్రం ఒకటే రాజధాని… ఒకటే రాష్ట్రమని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నరాధా తాజాగా రాజధాని ఆందోళనల్లో పాల్గొని జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.