టాలీవుడ్ టాప్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల నిమిత్తం చేపట్టబోయే రథయాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. సదరు వాహన వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అనే ట్యాగ్ లైన్ తో దీన్ని విడుదల చేసారు.
వాహనాన్ని, ట్రయల్ రన్ ను బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు పవన్.ఈ మేరకు తమ పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను ఇచ్చారని, వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారని సమాచారం.
దుర్గామాత సప్తమాత్రుకల్లో వారాహి ఒకరు.సప్తమాత్రుకలే రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి సంహరించాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో తమ వాహనానికి వారాహి అని పేరుపెట్టడం విశేషం.