సినిమాల్లో లేడీ విలన్ పాత్రలు పోషించాలి అంటే కాస్త ధైర్యం ఉండాలి అనే మాట వాస్తవం. ఇక స్టార్ హీరోల సినిమాల్లో లేడీ విలన్ అంటే చాలు జనాలు కాస్త ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. ఇతర భాషల్లో ఏమో గాని మన తెలుగులో మాత్రం కాస్త లేడీ విలన్ పాత్రల విషయంలో హీరోయిన్లు భయపడే పరిస్థితి ఉంటుంది. నరసింహ సినిమా తర్వాత రమ్యకృష్ణ ను చూసి కొందరు లేడీ విలన్ గా నటించే ప్రయత్నం చేసారు.
కాని మన సౌత్ లో ఆ రేంజ్ లో నటించిన లేడీ విలన్ మాత్రం కనపడలేదు అనే మాట వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో లేడీ విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పాలి. ఆమె నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో విలన్ గా నటించింది. ఆ పాత్రకు ఆమె న్యాయం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఆమెకు నెగటివ్ పాత్రలు బాగానే వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ బాగా పెరిగింది అనే టాక్ ఉంది. ఈ సినిమా నుంచి ఆమె కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుంది. ఈ సినిమా హిట్ తర్వాత ఆమె ఇక తగ్గే ఛాన్స్ లేదని అంటున్నారు. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తుందని సమాచారం.