కరోనా కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి. దీనితో ఒక్కసారిగా ఓటిటి కి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. మరోవైపు వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ లవైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, నిత్యామీనన్,తమన్నా లాంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తుండగా ప్రముఖ దర్శకులు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ లవైపు అడుగులు వేస్తున్నారు.
అయితే తాజాగా వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్యా రాజేష్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ తెరకెక్కించనున్న ఈ సిరీస్‌ను ఆనంద వికటన్ సంస్థ నిర్మించనుంది. అయితే ఈ సిరీస్‌లో వరలక్ష్మి ఐశ్వర్య లు సవతులుగా నటించనున్నారని సమాచారం.