శనివారం నటి వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు చాలా మంది సినీ స్టార్స్, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ఆమె పుట్టినరోజును పురష్కరించుకుని యశోద మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
అత్యంత ప్రతిభావంతురాలైన మధుబాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో మధు బాల పాత్రలో నటిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్.
ఇక ఫస్ట్ లుక్ లో ఆమె స్టైలిష్ గా కనిపించారు. హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రెగ్నెంట్ నర్సు పాత్రలో సమంత కనిపించనుంది.
రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.