ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో నటిస్తున్న రవితేజ, ఇది అయ్యాక డాన్‌శీను, బలుపు కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హ్యాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రవితేజ 66వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, శృతి హాసన్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పింది.
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటిస్తున్న ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందట. అందుకు తగ్గట్లే గోపీచంద్ మలిలేని, పాత్రకి తగ్గ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సీనియర్ యాక్టర్ సముద్రఖనిని కాస్ట్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు తెరపై మెరిసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఏ పాత్రలో అయినా నటించి మెప్పించగలదు. అలాంటి నటి రవితేజతో నటించడం సినిమాకి హెల్ప్ అవకాశం ఉంది. నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియాల్సి ఉంది.