హైకోర్టు లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈకేసులో మరో సాక్షిని పోలీసులు విచారించారు. హైదరాబాద్‌లో ఓ రహస్య ప్రదేశంలో ఇనుమల సతీష్ అనే వ్యక్తి స్టేట్‌మెంట్‌ను రామగుండం పోలీసులు రికార్డ్ చేసారు. సతీష్ గతంలో మంథని సర్పంచ్‌గా పనిచేశాడు.
వామన్రావు హత్య తర్వాత తనకు ప్రాణ హాని ఉందని సతీష్ గవర్నర్, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనకు రామగుండం పోలీసులు భద్రత కూడా కల్పించారు. అయినా ప్రాణభయంతో గత కొంత కాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు సతీష్. దీంతో స్వయంగా రామగుండం పోలీసులే హైదరాబాద్‌కు వచ్చి సతీష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాగా ఇప్పటికే ఈ కేసులో వామనరావు తండ్రితో పాటు హత్య జరిగిన ప్రదేశంలో.. ఆ సమయంలో అక్కడే ఉన్న బస్సు కండక్టర్, డ్రైవర్‌ను కూడా పోలీసులు ఇప్పటికే విచారించినట్టు తెలిసింది. వామన్ రావు హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.