అనగనగా ఓ పుస్తకాల పురుగు.. మెరుగైన ఉద్యోగ భవితకు ఒకటే ప్రిపేరింగ్ పరుగు.. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి… నో ఫామిలీ మేటర్..నో లైఫ్ పార్థనర్… ఒకటే రీడింగ్.. నో అదర్ ఫీలింగ్స్…!
పెళ్లంటూ చేసుకున్నాక భార్య ఇలాంటి పుస్తకాల పురుగును భరిస్తుందా..? తన చిన్ని కొరికైనా…అచ్చటా ముచ్చటైనా తీర్చకపోతే ఉరుకుంటుందా..? నో కాంప్రమైజ్… !?
అందుకే మధ్యప్రదేశ్ భోపాల్ కటరా హిల్స్ ఏరియా భామ భర్త ఓవర్ రీడింగ్ తట్టుకోలేక కోర్టు తలుపు తట్టింది. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారు చివరికి ఇద్దరినీ కౌన్సెలింగ్ కు పిలిస్తే షాకింగ్ ఆన్సర్..!
పెళ్లి చేసుకున్నా… మంచి ఉద్యోగం లేకుంటే ఎలా? అందుకే సీరియస్ గా యూపీ పీ ఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. కాపురంలో ఎలాంటి తేడాల్లేవు…ఇదీ భర్త ఆన్సర్.
చివరకు ట్విస్ట్ ఏమిటంటే … విడాకులపై మరోసారి ఆలోచించుకోవాలని లీగల్ అథారిటీ సజేషన్…! దటీజ్ టుడే కపుల్స్…!!