హైదరాబాద్: గణేశ్ అవతారాలు అన్నీఇన్నీ కావు. ఒక్కో చోటా ఒక్కో రూపం. మండపాల్లో ఎన్ని వేషాలేస్తాడో స్వామి…! వినాయక చవితి వచ్చిందంటే ఔత్సాహికులు కూడా బుర్రకు పదును పెడుతుంటారు. క్రియేటివిటీ చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. గృహోపకరణాలు విక్రయించే ఓ షోరూమ్ వాళ్లు ఇదిగో ఇలా మిక్సర్లు, గ్రైండర్లతో మహా గణపతి విగ్రహాన్ని రూపొందించారు. మిక్సీలతో కాళ్లు, ఐరన్ బాక్సులతో చెవులు చూశారా? వాటే క్రియేటివిటీ సర్‌జీ.. అంటూ నెటిజన్లు ఈ రూపాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.