సాక్షి దినపత్రికను తగలబెట్టారు టీడీపీ నేత వార్ల రామయ్య. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సాక్షి దినపత్రికపై విమర్శలు గుప్పించారు. పత్రిక రంగం చాలా ప్రాధాన్యమైనది. వాస్తవాలను తెలుసుకుని ప్రచురించాలి. ఆధారాలు లేకుండా రాతలు రాస్తున్నారు. వైసీపీ నేతల మాటలకే నేను ఇప్పుడు ఈ పత్రికను తగలబెడుతున్నానన్నారు.
ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు మంచిగా పరిపాలించండి. మీరు ప్రస్తుతం శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు. చంద్రబాబు పై వికృతంగా ప్రచారం చేస్తున్నారు. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముంది? రహస్యంగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? పైకి గంభీరంగా కనపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ లోపల భయపడుతున్నారు’ అని వర్ల రామయ్య అన్నారు.