వర్మ.. కాంట్రవర్షికి పెట్టింది పేరు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ వచ్చిన సంగతి తెలిసిందే . మొదటి ట్రైలర్‌లో వర్మ అటు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎవ్వరిని వదల్లేదు. తాజాగా వర్మ రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశాడు.
ఈ ట్రైలర్ లో పవన్ కళ్యణ్ ను అరెస్ట్ చేస్తే అంటూ ఒక డైలాగ్ పెట్టాడు.ఇంకేముంది పవన్ ఫాన్స్ కు ఈ మాట నచ్చలేదు. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా అంటూ వర్మను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ మహిళలతో ఓ బహిరంగ సభలో పవన్ డాన్స్ చేస్తున్నట్టు వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ పై ఆగ్రహంగా ఉన్న పవన్ ఫ్యాన్స్, ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి వర్మ పై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో పవన్ ను తప్పుచేసినవాడిలా చూపిస్తే ఉరుకోము అంటూ హెచ్చరిస్తున్నారు. కమ్మరాజ్యం లో కడప రెడ్లు సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.