వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే డైరెక్టర్ వర్మ అనే చెప్పాలి. మొన్నటివరకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా తో చంద్రబాబు, పవన్ ను ఆదుకున్న వర్మ ఇప్పుడు మరోసారి తాను ఎవరికి అర్ధంకాను అని నిరూపించుకున్నాడు. తల్లి మీద ఒట్టు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటూ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎప్పుడూ ఎదో ఒక కామెంట్ చేస్తూ ఉండే వర్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం వెనుక ఏమి దాగుందో తెలియక అటు వర్మ ఫాన్స్, పవన్ ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
బ్యూటీఫుల్’ అనే చిత్రం ప్రమోషన్ కోసం వర్మ ప్రీ న్యూ ఇయర్ పార్టీని ఇచ్చాడు. ఆ పార్టీలో వర్మ చేసిన హడావుడి మామూలుగా లేదు. ఆ పార్టీలో డాన్స్ లు చేయడం.. హీరోయిన్ కాళ్లను మొక్కడం తో పాటు పవన్ కళ్యాణ్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి తిక్క ఉంది నాకు లెక్క ఉంది. కాని చాలా మందికి లెక్క కంటే తిక్క నచ్చుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయ్యాడు. తనకు శ్రీదేవి కంటే కూడా అధికంగా పవన్ కళ్యాణ్ ఇష్టం అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.
నేను దేవుడిని నమ్మను కాబట్టి మా అమ్మే నాకు దైవం. అందుకే మా అమ్మ మీద ఒట్టు వేసి చెబుతున్న పవన్ కళ్యాణ్ అంటే నాకు చాల ఇష్టం. వర్మ మాటలపై కొంతమంది తాగి మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. మరికొంత మంది మాతరం తల్లి మీద ఒట్టు వేశాడు నమ్మొచ్చు అంటూ చర్చించుకుంటున్నారు.