ఫ్యాక్షన్..పాలిటిక్స్.. క్యాస్ట్… ఏమిటీ డిఫరెంట్ సబ్జెక్ట్…! కమ్మరాజ్యంలో కడప రెడ్లు…మూవీ ఫస్ట్ లుక్ వచ్చాక ఇదే అందరికీ ఒక టాపిక్..! కాంట్రావర్సీ క్రియేటర్ రామ్‌గోపాల్‌వర్మ న్యూ క్రియేషన్ మూవీ కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఇది రెండు కులాల సీమ ఫాక్షనిస్టుల కథా…! లేక పొలిటికల్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పోరు కథా…!! లేక రెండు కులాల ఆధిపత్య పోరాట కథా…!? అనేది చర్చనీయాంశంగా మారింది. టీజర్‌లో పిడికిలి బిగించిన సీన్స్, డబ్బు కట్టలు, రెండు పార్టీల జెండాలు, బెజవాడ, కడప రైల్వే జంక్షన్ బోర్డులు, దూసుకొచ్చిన కత్తి రక్తం మరకలు… ఇవీ నేపద్యాలు..!
అంటే ఇది ఫ్యాక్షన్, పొలిటికల్, క్యాస్ట్ డామినేషన్ వార్ ఇండికేషన్..! టీజర్ ప్రకారం నాన్ కాంట్రవర్సీ మూవీ విత్ కాంట్రవర్సీ కేరక్టర్స్ అని తెలుస్తోంది. వర్మ ఈ మూవీతో కొత్త కాంట్రావర్సీ క్రియేట్ అవుతారా…? లేక ఇది కూడా ఏదో అవుతుందనుకుంటే బోర్లా పడుతుందా..? త్వరలోనే తేలుతుంది.