వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పర్యవేక్షణలో రాబోతున్న చిత్రం మర్డర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత-ప్రణయ్ ప్రేమ, పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో వివాదాలు నడిచాయి. ప్రణయ్ తండ్రి బాలస్వామితో పాటు అమృతలు వేర్వురుగా సినిమాను నిలుపుదల చేయాలని న్యాయపోరాటం కూడా చేశారు. మానుతున్న గాయాన్ని మళ్లీ రేపుతున్నారంటూ మండిపడ్డారు.
అయితే, తాను నిజ జీవితంలో ఉన్న ప్రచారం ఆధారంగా ఊహాజనిత కల్పిత చిత్రం తీస్తున్నానని వాదించటంతో కోర్టులో ఇప్పటికే వర్మకు గ్రీన్ సిగ్నల్ రాగా… తాజాగా సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. పేరెంటల్ గైడెన్స్ కేటగిరీలో చిత్రం విడుదలకు అనుమతిచ్చారు. సినిమాయు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు.
All Hurdles cleared for MURDER release 💐💐💐 Coming to kill in theatres 💪💪💪 pic.twitter.com/YhZjbkadkJ
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2020
Advertisements