రాంగోపాల్ వర్మ ఈ పేరు కు పెద్దగా పరిచయం అవసరం లేదు. అయితే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ రిలీజ్ డేట్ ముందు రోజు వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవటం, ఎన్నో వివాదాల మధ్య ఆఖరికి సినిమా రిలీజ్ అయ్యింది.
ఇదంతా ఒక ఎత్తు. ఇక విషయానికి వస్తే… వర్మ దర్శకులందరికి చాలా డిఫరెంట్. దర్శకులందరు కథలకు పరుగులు తీస్తుంటే వర్మనే కథలు వెతుక్కుంటూ వస్తాయి. సినిమా రిలీజ్ కి ముందు మీడియాతో మాట్లాడిన వర్మ తన నెక్ట్స్ సినిమా గురించి చెప్పేశాడు. తన సినిమా ఆపటానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరు చేశారు అనే అంశంపై తాను సినిమా తెయ్యబోతున్నట్టు చెప్పుకొచ్చాడు వర్మ.