దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దీనితో వర్మ దృష్టి ఈ ట్రైలర్ పై పడింది.
#BheemlaNayakTrailer చూస్తుంటే, రానా దగ్గుబాటిని ప్రమోట్ చేయడానికి క్రియేటర్లు పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకున్నారని అనిపిస్తుంది. నేను పీకే అభిమానిగా బాధపడ్డాను అంటూ వరుస ట్వీట్ లు చేశారు వర్మ.
పవన్ కళ్యాణ్ ని చీకటి వెలుగులో చూపించినట్లే ‘భీమ్లా నాయక్’ కంటే రానాని బాగా చూపించినందుకు సినిమాకు ‘డేనియల్ శేఖర్’ అనే టైటిల్ పెట్టాలి అంటూ ట్వీట్ లలో పేర్కొన్నారు.
ఇక వర్మ ట్వీట్ లు చూసిన అభిమానులు ట్విట్టర్‌లో, ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తూ వర్మ ను ట్రోల్ చేస్తున్నారు.