కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో వస్తున్న వర్మ రోజుకో ఫోటోని పోస్టు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే వర్మ రిలీజ్ చేసిన పోస్ట్లపై టీడీపీ నాయకులూ గుర్రుగా ఉన్నారు. మరో వైపు జనసేన అధినేత పవన్ అభిమానులు కూడా అంతే కోపం గా ఉన్నారు.
అయితే, తాజాగా వర్మ మరో ఫోటో ని పోస్ట్ చేశాడు.
చంద్రబాబు తన ఇంటి గార్డెన్ లో యోగ చేస్తూ కూర్చున్న ఫోటో విడుదల చేశారు. ఆ ఫోటోలో వెనుక లోకేష్ పుస్తకం చదువుతూ కనిపిస్తున్నాడు. చుట్టూ సెక్యూరిటీ మధ్య చంద్రబాబు యోగ చేస్తున్న ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
వర్మ పై కోపం ఉన్నవాళ్లు కోపంతో, అభిమానం ఉన్నవాళ్లు అభిమానంతో కామెంట్స్ చేస్తున్నారు. వర్మ ఈ సినిమాతో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో అని నెట్టింట్లో గుసగుస లాడుతున్నారు.