నా నెక్ట్స్ ఫిక్చర్ మట్టి కుండలో మజ్జిగన్నం : వర్మ - Tolivelugu

నా నెక్ట్స్ ఫిక్చర్ మట్టి కుండలో మజ్జిగన్నం : వర్మ

 

Varma Shocking Comments On His upcoming Movie, నా నెక్ట్స్ ఫిక్చర్ మట్టి కుండలో మజ్జిగన్నం : వర్మ

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా వివాదస్పదంగా మారి కోర్టు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. కొంత మంది రాజకీయ నేతలను, వారి హావభావాలను ఆర్జీవీ ఆ సినిమాలో చూపించారనేది ఆరోపణ. ఆ చిత్రంలో ఓ పాత్ర జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలి ఉండటంపై  పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశంలో దీనిపై ఆర్జీవీని ప్రశ్నించగా.. సినిమాలో జనసేన లేదని.. అది మనసేన అని చెప్పారు. ఈ సినిమాలో చూపించిన మనసేనకు, జనసేనకు సంబంధం లేదన్నారు. అలాగే నా నెక్ట్స్ ఫిక్చర్ మట్టి కుండలో మజ్జిగన్నం అని వెల్లడించారు. అంతలోనే మీతోడు.. ఇది పొలిటికల్ సెటైర్ మాత్రమే అన్నారు. కొంతమంది ఫేమస్ వ్యక్తులను పోలి ఉండటం యాదృచ్ఛికం మాత్రమే. ”ఏదైనా తప్పుంటే దేవుడు నన్ను శిక్షించుగాక”అంటూ తనదైన శైలిలో ముగించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp