పొలిటికల్ అవ్వని, సినిమా అవ్వని విషయం ఏదైనా సరే వర్మ ట్వీట్ చేశాడు అంటే అక్కడ కాంట్రవర్శీ ఉంటుంది. ఇటీవల కాలంలో సినిమా టికెట్స్ ధరలపై వరుస ట్వీట్ లు చేసి వార్తల్లో నిలిచారు వర్మ. కాగా ఇప్పుడు తాజాగా వర్మ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వర్మ తెరకెక్కించిన థ్రిల్లర్ సినిమాలో నటించిన అప్సరా రాణి గోవా లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీ సండే అంటూ ఆదివారం కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో బికినిలో దర్శనం ఇచ్చింది ఈ బ్యూటీ.
ఇక ఆ ఫోటోలు అటు తిరిగి ఇటు తిరిగి వర్మ దగ్గరకు చేరాయి. వాటి పై వర్మ స్పందిస్తూ… నువ్వు మాతో లేకుండా ఇలా అక్కడెక్కడో ఉంటే అది హ్యాపీ సండే ఎలా అవుతుంది అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
అయితే అప్సరా కూడా రిప్లై ఇచ్చింది. అయితే వీడియోను షేర్ చేస్తాను. కాస్త్ బెటర్ ఫీలింగ్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే ఆర్జీవీ దానికి దీనికి తేడా ఏం ఉంది అంటూ మళ్ళీ రిప్లయ్ ఇచ్చాడు. వర్మ, అప్సరా ల మధ్య జరిగిన ఈ సంభాషణ వైరల్ అవుతుంది.