ఏపీలో వైసీపీని తప్ప మిగిలిన పార్టీలను కవ్విస్తూ ఉంటాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాడు. తనకు సంబంధం లేకపోయినా.. ట్వీట్లు, వీడియోలు పోస్ట్ చేస్తూ జనసైనికులను కావాలని రెచ్చగొడుతుంటాడు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏదైనా గానీ.. నిత్యం కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటుంటాడు వర్మ.
ప్రస్తుతం తెలంగాణలో బండి సంజయ్ కుమారుడి వీడియోల చుట్టూ వివాదం మొదలైంది. యూనివర్సిటీలో విద్యార్థులను కొడుతున్న వీడియోలు బయటకు రావడం.. అతనిపై కేసు నమోదు చేయడం.. యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేయండి.. అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే, వర్మ ఈ ఇష్యూకి సంబంధించి సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.
ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను గుర్తు చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆనాడు సద్దాం హుస్సేన్, అతని కుమారుడు ఉదయ్ హుస్సేన్ ల తీరును ఇప్పుడు బండి, అతని కుమారుడికి ఉదాహరణగా వర్ణించాడు.
ఆర్జీవీ చేసిన ట్వీట్
‘‘ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ, అతడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు’’