రామ్ గోపాల్ వర్మ… ఏం చేసినా సంచలనం గానే మారుతూ ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వర్మ. తన ట్విట్ లు కూడా కొంతమందికి మాత్రమే అర్థం అవుతూ ఉంటాయి. అయితే వర్మ టార్గెట్ ఎప్పుడూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది.
ఆయన సినిమా రిలీజ్ అయినా లేక మరే విషయం పైన అయినా పవన్ కళ్యాణ్ పై ఎక్కువగా ట్వీట్లు చేస్తూ ఉంటాడు వర్మ. అయితే తాజాగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశాడు వర్మ.
తాను గతంలో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ని హింది లో రిలీజ్ చెయ్యొద్దు అని చెబితే వినకుండా చేశారని దాని ఫలితం ఎలా వచ్చిందో కూడా చూశామన్నారు.
కానీ ఇప్పుడు మీ భీమ్లా నాయక్ సినిమాని పాన్ ఇండియా సినిమా లెవెల్ లో రిలీజ్ చేసి మీ పవర్ ఏంటో ప్రూవ్ చెయ్యండి అంటూచెప్పుకొచ్చాడు. పవన్ పై ఇటీవల కాలంలో వర్మ ఏ ట్వీట్ చెయ్యలేదు. కానీ ఒక్కసారిగా మళ్ళీ పవన్ పై ఎందుకు ట్వీట్ చేశాడా అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇంతకీ వర్మ ఎందుకు ఈ ట్వీట్ చేశాడో ఆయనకే తెలియాలి.
. @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు…ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి.
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
Advertisements