ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క.. వర్మ ఎంటరయ్యాడు…. రాసిపెట్టుకోండి రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యాడు అంటున్నారు సినీ అభిమానులు. అవును ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల ధరల విషయమై ప్రభుత్వానికి సినీ స్టార్ట్ కి మధ్య వార్ నడుస్తోంది. కాగా గత నాలుగు రోజుల నుంచి వర్మ ఏపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
అలాగే కొన్ని ప్రశ్నలను కూడా విసిరారు. తాజాగా ఇప్పుడు మరో ట్వీట్ చేసి వివాదం లోకి కొడాలి నాని ని తీసుకొచ్చాడు వర్మ. AP టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు అని బాంబ్ పేల్చాడు వర్మ.
కాగా గతంలో నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ నాకు తెలిసింది కొడాలి నాని అన్న ఒక్కడే. న్యాచురల్ స్టార్ నాని ఎవరు నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు.
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
Advertisements