అమెరికాలో భారత విద్యార్థి ఒకరు హత్యకు గురయ్యారు. పర్డ్యూ వర్సిటీలో భారతీయ అమెరికన్ విద్యార్థి వరుణ్ మనీష్ ఛేడా(26)ను అతని రూమ్ మేట్ దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హత్యా ఆరోపణలపై నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.
మనీష్ చేడా డేటా సైన్స్ చదువుతున్నాడు. ఇండియానా రాష్ట్రంలో వసతి గృహంలో ఉంటున్నాడు. అతని రూమ్ మేట్ మేజర్ జీ మిన్ షా(22) సైబర్ సెక్యూరిటీ కోర్సు నేర్చుకుంటున్నాడు. మనీష్ చేడా మరణించగా ఆ విషయాన్ని జీ మిన్ షా బుధవారం తమకు ఫోన్ చేసి చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని మృత దేహంపై గాయాలను పోలీసులు గుర్తించారు. దీంతో ప్రాథమికంగా శవ పరీక్షలు నిర్వహించగా మనీష్ ది హత్యగా వెల్లడైంది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
దీంతో కొరియన్ రూమ్ మెట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పర్డ్యూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిచ్ డేనియల్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనపై పోలీస్ శాఖ లోతుగా దర్యాప్తు జరుపుతోందని తెలిపారు.