టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ కంచె సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత తొలి ప్రేమ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వరుణ్ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలను… అలాగే ఫ్యామిలీ అప్డేట్ ను షేర్ చేస్తూ ఉంటాడు. అయితే గతంలో తన సోదరి నిహారిక విషయంలో చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గని ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్…నేను,నిహారిక బయట ఉన్నప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని నాన్న అడుగుతారని అలా అడగొద్దు అని చెప్తూనే ఉంటామని కానీ ఆయన మాత్రం త్వరగా వచ్చేయండి అంటూ ఫోన్లు చేస్తూ ఉంటారని చెప్పారు. కాగా మొన్నటికి మొన్న నిహారిక అర్ధరాత్రి ఓ పబ్ లో కనిపించింది. అయితే ఆ పబ్ లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న ఆరోపణలతో పోలీస్ స్టేషన్ కి కూడా హాజరైంది.
ALSO READ : మహేష్ ఫాన్స్ ను భయపెడుతున్న జగన్
ఈ నేపథ్యంలో వరుణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక వరుణ్ నటించిన గని చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు బాబీ సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు.
ఆచార్య, అఖండ సినిమాలలో ఉన్న ఈ కామన్ పాయింట్స్ గమనించారా ?