హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన హీరో వరుణ్ సందేశ్. మొదటి సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న వరుణ్ కొత్తబంగారులోకం సినిమాతో తెలుగు ఇండస్ట్రీని తనవైపు చూసేలా ఆకట్టుకున్నాడు. తరువాత అవకాశాలు అయితే వచ్చాయి కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.
ఎప్పుడో ఒక సినిమాతో వెండితెర మీద కనిపించే వరుణ్ ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ౩లో భార్య తో సహా వచ్చాడు. అప్పటివరకు ప్రేక్షకులకు దూరంగా వరుణ్, వితికాలు బిగ్ బాస్ తో చేరువయ్యారు. బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక తెగ ఫోటో షూట్ లు చేస్తున్నారు. వారిద్దరి స్టిల్స్ కు నెటిజన్లు కూడా అదే రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. సంప్రదాయమైన దుస్తుల్లో, విద్యుత్ దీపాల కాంతుల్లో మెరుస్తూ కౌగిలించుకుని ఉన్న ఫొటోస్ ని వరుణ్ పోస్ట్ చేశాడు.