మామూలుగా సినీ స్టార్స్ కు ఫ్యాన్స్ ఉంటారు. మరి కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం ఓ అభిమాని ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి తన అభిమానాన్ని చాటి చెప్పాడు.
నిజామాబాద్ జిల్లా బిక్కనూరు నుండి పాదయాత్ర ద్వారా హైదరాబాద్ కు బాలు చేరుకున్నారు. అనంతరం వరుణ్ ను కలుసుకున్నారు. అంత దూరం నుండి వచ్చిన బాలు కి వరుణ్ ఆహ్వానం పలికాడు. అంతేకాకుండా బాలుతో చాలా సమయం కూర్చుని మాట్లాడాడు. ఆరోగ్యం గురించి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు. ఇకపై ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేశాడు.