మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ చిత్రం ‘గని’. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన.
అప్ డేట్స్ ఆ అంచనాలను అంతకంటే పెంచాయి. తాజాగా వరుణ్‌తేజ్ బర్త్‌డే సందర్భంగా చిత్రయూనిట్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. గని నుంచి ఓ చిన్న టీజర్ విడుదల చేసింది.
టీజర్ లో వరుణ్‌కి సునీల్ శెట్టి ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఉంది. కాగా ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగనుండగా.. వరుణ్‌తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ కాగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.