మెగా హీరో వరుణ్ తేజ్ తర్వాతి సినిమాలో బాక్సర్ గా నటిస్తున్నారన్నది పాత వార్తే. టైటిల్ కూడా బాక్సర్ అంటూ ప్రచారం జరిగినా… వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ బాక్సింగ్ డ్రామాకు గని అనే టైటిల్ ఫైనల్ చేయగా, బాక్సర్ గా స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా కోసం వరుణ్ చాలా వెయిట్ తగ్గటంతో పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. స్ట్రిక్ట్ డైట్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. ఇక గని తో కిరణ్ కొర్రపాటి మొదటిసారి డైరెక్టర్ గా లక్ పరీక్షించుకోనున్నాడు.
వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సూపర్ స్టార్ ఉపేంద్ర విలన్ పాత్ర పోషిస్తున్నారు. జులైలో విడుదలవ్వనున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరుణ్ ప్రస్తుతం ఎఫ్3 మూవీలో వెంకటేష్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు.