గద్దలకొండ గణేశ్ అలియాస్ ‘వాల్మీకి’ త్వరలో జనం ముందుకొస్తున్నాడు. వాల్మీకిలో మెగాహీరో వరుణ్‌తేజ్ పాత్ర పేరు ఇదేనని డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్విట్టర్‌లో తాజాగా రివీల్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా వుంది. ‘గద్దలకొండ గణేశ్’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు వరుణ్.
పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. ఇతర పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Let’s welcome the Brand new and the Grand new Avataar of @IAmVarunTej …. https://t.co/YjoYpjH5o4
Along with….. @Atharvaamurali @hegdepooja @mirnaliniravi @DoP_Bose @MickeyJMeyer
— Harish Shankar .S (@harish2you) August 15, 2019