వాల్మీకి టైటిల్‌పై బోయ సామాజిక వర్గం అభ్యంతరం
కొత్త టైటిల్ గద్దలకొండ గణేష్ అని నిర్ణయం తీసుకుంటామని కోర్టుకి తెలిపిన నిర్మాతలు, దర్శకుడు
హీరో వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వాల్మీకి’ పేరును ‘గద్దలకొండ గణేశ్’గా మార్చుతూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా బోయ సామాజిక వర్గాలు ఈ సినిమా టైటిల్ మార్చాలని ఆందోళన చేస్తున్నారు. దీంతో మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న’వాల్మీకి’ పేరు విడుదలకు సరిగ్గా కొద్ది గంటలకు ముందు మారింది. ‘గద్దలకొండ గణేశ్’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. బోయ సామాజిక వర్గం అభ్యంతరాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్ని థియేటర్లలోనూ మార్చిన పేరుతో సినిమా రానుందని తెలిపారు.